News
పామును ప్రెమించి పెళ్లి చేసుకుంది
అతాల్ గ్రామానికి చెందిన బిమ్‌బాలా ఇంట్లో పురానతమైన ఒక పుట్ట ఉంది. దానిలో ఒక పాము నివాసం ఉంటోంది. ప్రతీ రోజూ ఆ పాము బయటకు వచ్చి బిమ్‌బాలా అందించే పాలను తాగి, ఆమె ఒడిలో సేదతీరి మళ్లీ లోపలికి వెళ్లిపోయేదట.. రోజూ ఇలా జరుగతుండడంతో బిమ్‌బాలాకు ఆ పాముపై ప్రేమ ఏర్పడింది. దీంతో ఆ పామునే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె అభిప్రాయానికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా మద్దతు పలికారు. పాము కూడా బిమ్‌బాలాను ప్రేమిస్తోందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఆ పాము ఎప్పుడూ బిమ్‌బాలాను కాటువేసేందుకు ప్రయత్నించలేదట. మరింకేం గ్రామస్తులంతా కలిసి ఒక మంచి ముహూర్తం చూసి పాముతో బిమ్‌బాలాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే ముహూర్తం సమయానికి ఆ వరుడు పాము బయటకు రాకపోవడంతో... తాత్కాలికంగా ఒక బొమ్మ పామును రూపొందించి దానితో బిమ్‌బాలాకు పెళ్లి జరిపించారు. ఈ పాము, బాల వివాహానికి 1500 మంది హాజరవడం విశేషం.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








